ఖమ్మంలో ఆటో కార్మికుల భారీ ర్యాలీ.. మద్దతుగా పువ్వాడ అజయ్

రిపోర్టర్: amudala Venkanna స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం నగరంలో ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ సెప్టెంబర్ 6న భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ నాయకులు ప్రకటించారు. ఉదయం 9 గంటలకు గాంధీచౌక్ నుంచి ఈ ర్యాలీ ప్రారంభం కానుంది.

ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరై కార్మికులకు మద్దతు తెలపనున్నారు. ఆటో కార్మికులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని నాయకులు పగడాల నాగరాజు, షేక్ షకీనా పిలుపునిచ్చారు.