హైవేపై భారీ ట్రాఫిక్ జామ్: పంతంగి టోల్‌ప్లాజా వద్ద బారులు తీరిన వాహనాలు
రిపోర్టర్: విజయ్
స్థలం: యాదాద్రి భువనగిరి
దసరా పండుగ ప్రయాణాలతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిందని అధికారులు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫ్లైఓవర్ నిర్మాణ పనులు, సర్వీస్ రోడ్డు మార్పుల కారణంగా ట్రాఫిక్ జామ్ మరింత తీవ్రమైందని, రద్దీని తగ్గించేందుకు అదనపు సిబ్బందిని మోహరించి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు రవాణా శాఖ అధికారులు వెల్లడించారు.