రాజస్థాన్ సాంబార్ సరస్సులో వందే భారత్ రైలు అద్భుత ప్రయాణం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: రాజస్థాన్

రాజస్థాన్‌లోని ప్రసిద్ధ సాంబార్ సరస్సు మీదుగా ఢిల్లీ-జోధ్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వెళ్తున్న అద్భుత దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఆధునిక సాంకేతికతతో కూడిన ఈ రైలు, ప్రకృతి అందాల మధ్య ప్రయాణిస్తుండటం పర్యాటకులను కట్టిపడేస్తోంది. జైపూర్ ఫోటోగ్రాఫర్ యోగేష్ సెవ్కానీ తీసిన ఈ వీడియో, దేశంలోని అతిపెద్ద ఉప్పునీటి సరస్సు సౌందర్యాన్ని, రైల్వే ఇంజనీరింగ్ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెబుతోంది. పక్షుల సందడితో ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగా అలరారుతోంది.