తెలుగుదేశం పాలనలోని అభివృద్ధిని గమనించి ఓటేయాలని చింతకాయల విజయ్ పిలుపు

రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు స్థలం: నర్సీపట్నం

నర్సీపట్నం నియోజకవర్గ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు గమనించాలని కోరారు. ఈ సమావేశంలో స్థానిక మహిళలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.