ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు 'సీక్రెట్ సోల్జర్'
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: తెలంగాణ
నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా నటించిన స్పై డ్రామా ‘సీక్రెట్ సోల్జర్’ ఈ నెల 18న విడుదల కానుంది. సెన్సార్ అభ్యంతరాల కారణంగా ‘చైనా పీస్’ టైటిల్ మార్చి ఈ పేరు ఖరారు చేసినట్లు హీరోలు తెలిపారు. దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారం, నెల్లూరుకు చెందిన ఇద్దరు యువకుల మధ్య జరిగే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిందని వారు వెల్లడించారు.