విజయవాడలో ఐదు బూట్లలో రీపోలింగ్ జరపాలంటూ ఏబీ వెంకటేశ్వరరావు ధర్నా
రిపోర్టర్: రాము
స్థలం: విజయవాడ
విజయవాడలో వైకాపా మరియు తెదేపా వర్గాల ఘర్షణ నేపథ్యంలో ఐదు బూట్లలో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ మేయర్ స్వతంత్ర అభ్యర్థి ఏబీ వెంకటేశ్వరరావు పోలింగ్ కేంద్రం గేటు వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. న్యూరాజరాజేశ్వరీపేటలోని కేర్ అండ్ షేర్ పాఠశాలలో జరిగిన ఉద్రిక్తతపై అధికారులకు లేఖ రాసినట్లు ఆయన పేర్కొన్నారు. నిందితులను అరెస్ట్ చేసే వరకు కదిలేది లేదని స్పష్టం చేస్తూ ఆయన ఆందోళన తీవ్రతరం చేశారు.