మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన లారా వోల్వార్డ్.

రిపోర్టర్: భాస్కర్ స్థలం: World

జింబాబ్వేతో జరిగిన టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ అజేయ సెంచరీతో చెలరేగింది. కేవలం 62 బంతుల్లో 126 పరుగులు చేసి రికార్డు సృష్టించింది. దీని ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీల జాబితాలో భారత స్టార్ స్మృతి మంధాన సరసన నిలిచింది. ఈ భారీ విజయంతో దక్షిణాఫ్రికా సిరీస్‌ను కైవసం చేసుకుంది.