పన్నుల విధానంపై ఫిక్కీ విజ్ఞప్తి: మూలధన లాభాల పన్ను మినహాయింపు కోరిన సంస్థ

రిపోర్టర్: గోపి స్థలం: న్యూఢిల్లీ

కేంద్ర బడ్జెట్ కు ముందు నిర్వహించిన సమావేశంలో లాభాల పన్ను మినహాయింపును పునరుద్ధరించాలని ఫిక్కీ సంస్థ కోరిందని రెవెన్యూ కార్యదర్శి అరవింద్ శ్రీవాస్తవ తెలిపారు. దేశంలో పెట్టుబడులను ఆకర్షించడానికి, విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ల నిష్క్రమణను అడ్డుకోవడానికి పన్ను విధానంలో మార్పులు అవసరమని ఫిక్కీ స్పష్టం చేసింది. బేషరతుగా పన్ను విధానాన్ని స్థిరంగా ఉంచాలని, జిఎస్ టి చెల్లించే వ్యాపారాలకు టిడిఎస్ మినహాయింపు ఇవ్వాలని ఆ సంస్థ ప్రధానంగా డిమాండ్ చేసింది.