అమరావతిలో ఎయిర్‌పోర్ట్ కోసం ఇరవై వేల ఎకరాల భూసేకరణ
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: అమరావతి
అమరావతిలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు కోసం 20 వేల ఎకరాల భూసేకరణ చేపట్టనున్నట్లు ఏపీ మంత్రి నారాయణ వెల్లడించారు. ఇందులో 5 వేల ఎకరాలు ఎయిర్‌పోర్టుకు, మిగతా భూమిని రోడ్లు మరియు బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం కేటాయిస్తామన్నారు. రాబోయే క్యాబినెట్ సమావేశంలో భూసేకరణ నోటిఫికేషన్‌కు ఆమోదం తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.