కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకే నాణేనికి రెండు వైపులు: తుమ్మల మురళీధర్ రెడ్డి

రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి స్థలం: ఆత్మకూరు(ఎం)

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుమ్మల మురళీధర్ రెడ్డి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ రెండు పార్టీలు ఒకే నాణేనికి రెండు వైపులని, కుటుంబ వారసత్వ రాజకీయాలతో ప్రజలను మభ్యపెట్టడమే వాటి విధానమని విమర్శించారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భూముల వ్యవహారాలు, మద్యం ఆదాయంపైనే దృష్టి పెట్టాయని ఆరోపించారు. ప్రజల సంక్షేమాన్ని విస్మరించి, ప్రజల బలహీనతలను ప్రభుత్వాలు ఆదాయ వనరులుగా మార్చుకోవడం సిగ్గుచేటని ఆయన ధ్వజమెత్తారు.