రేవంత్ రెడ్డి సోదరుడి కంపెనీపై మన్నె క్రిశాంక్ సంచలన ఆరోపణలు
రిపోర్టర్: వెంకట్
స్థలం: హైదరాబాద్
నాంపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి కంపెనీపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. లక్ష రూపాయల పెట్టుబడి ఉన్న కంపెనీకి రూ.200 కోట్ల విలువైన భూములు ఎలా కేటాయించారని ఆయన నిలదీశారు. తన కేసులో అరెస్టు చేయవద్దని, నోటీసులు ఇచ్చి విచారించాలని కోర్టు స్పష్టం చేసినా పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.