మహిళా క్రికెటర్ల రుతుచక్రాల సమాచారంతో బెట్టింగ్ వివాదం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: India
మహిళా క్రికెటర్ల రుతుచక్రాల సమాచారాన్ని ఉపయోగించి వారి ప్రదర్శనను అంచనా వేయవచ్చంటూ ఇన్స్టాగ్రామ్ యూజర్ రాజ్ గోమాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర గోప్యతా వివాదానికి దారితీశాయి. భారత బ్యాటర్ స్మృతి మంధాన గత ప్రదర్శనలను ఆమె పీరియడ్ సైకిల్ దశలతో పోల్చి విశ్లేషించినట్లు ఆయన తెలిపారు. ఈ అంశంపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండగా, క్రీడాకారిణుల వ్యక్తిగత ఆరోగ్య సమాచారాన్ని బెట్టింగ్ కోసం వాడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.