యూట్యూబర్ నందన అరెస్ట్, ఇబ్రహీంపట్నం పీఎస్‌కు తరలింపు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: ఎన్టీఆర్ జిల్లా
విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడిన యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు గతంలో నమోదైన కేసులో లుక్ అవుట్ సర్క్యులర్ జారీ కాగా, బ్రిటన్ నుంచి వచ్చిన ఆమెను ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని ఏపీ పోలీసులకు అప్పగించారు. విచారణ నిమిత్తం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.