తీరానికి తీవ్ర తుఫాను ముప్పు: బంగాళాఖాతంలో ఆక్వాన్ తుపాను ఏర్పడే అవకాశం

రిపోర్టర్: అశోక్ స్థలం: హైదరాబాద్

బంగాళాఖాతంలో నవంబర్ పదకొండు నుంచి పదహారు మధ్యలో ఆక్వాన్ తుపాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అనుకూల వాతావరణ పరిస్థితులు ఉంటే ఇది నవంబర్ మూడో వారంలో తీవ్ర తుపానుగా మారవచ్చని తెలిపారు. స్వల్ప వ్యవధిలో వరుసగా తుపానులు ఏర్పడుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే దీని వల్ల తెలంగాణలో వర్షాలు కురుస్తాయా లేదా అనేదానిపై స్పష్టత రావాల్సి ఉందని నిపుణులు పేర్కొన్నారు.