ఐఏఎస్ అధికారుల బదిలీలు: ఆమ్రపాలికి పర్యాటక శాఖ కార్యదర్శిగా బాధ్యతలు

రిపోర్టర్: విజయ్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సీనియర్ ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి కాటాను పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా నియమించినట్లు అధికారులు తెలిపారు. గత ఆగస్టు నుంచి జీఏడీలో వెయిటింగ్ లో ఉన్న ఆమెకు ఎట్టకేలకు కీలక బాధ్యతలు దక్కాయి. కేడర్ వివాదాల నేపథ్యంలో ఏపీకి వచ్చిన ఆమె నిరీక్షణ ముగిసింది. నూతన బాధ్యతలతో రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.