ఆసియా క్రీడల ప్రారంభ వేడుకల్లో అరుదైన ఘట్టం
రిపోర్టర్: శివ
స్థలం: Japan
జపాన్లోని నాగోయా వేదికగా ప్రారంభమైన 20వ ఆసియా క్రీడల ప్రారంభోత్సవంలో మాజీ హ్యామర్ త్రో ఛాంపియన్లు, తండ్రీకొడుకులైన షిగెనోబు మురోఫుషి, కొజి మురోఫుషి సంయుక్తంగా క్రీడాజ్యోతిని వెలిగించి అరుదైన రికార్డు సృష్టించారు. జపాన్ తరఫున ఎంతోమంది దిగ్గజ క్రీడాకారులు టార్చ్ రిలేలో పాల్గొనగా, చివరిగా ఈ తండ్రీకొడుకులు వేదికపైకి వచ్చి ఈ వేడుకను అద్భుతంగా ముగించారు.