ఐఐటీ బాంబే విద్యార్థి మృతిపై నిరసన చేపట్టిన తల్లిదండ్రులు

రిపోర్టర్: నరేష్ స్థలం: ముంబై

ఐఐటీ బాంబేలో మృతిచెందిన విద్యార్థి సాల్ వాకోడే మరణానికి న్యాయం చేయాలని కోరుతూ ఆయన తల్లిదండ్రులు ముంబైలో నిరాహార దీక్షకు దిగారు. తమ కుమారుడిని వేధించిన వారిని కఠినంగా శిక్షించాలని, కుల వివక్షపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 18న సాహిల్ హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కులాలు సుమోటోగా స్వీకరించి దర్యాప్తు చేపట్టింది.