నిడదవోలులో ఇంటింటికీ తిరిగి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేసిన కందుల దుర్గేష్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: తూర్పు గోదావరి

ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నిడదవోలు పట్టణంలోని తొమ్మిదవ వార్డు జండాల వీధిలో మంత్రి కందుల దుర్గేష్ ఇంటింటికీ స్వయంగా వెళ్లారు. లబ్ధిదారులను నేరుగా కలిసి పింఛన్లను పంపిణీ చేసినట్లు పర్యాటక శాఖ మంత్రి, నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రజలకు సంక్షేమ ఫలాలను మరింత చేరువ చేసేందుకే ప్రభుత్వ యంత్రాంగం క్షేత్రస్థాయిలో నిరంతరం పనిచేస్తోందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.