కల్పవృక్ష వాహనంపై భక్తులకు శ్రీవేంకటేశ్వర స్వామివారి దివ్యదర్శనం

రిపోర్టర్: రమేష్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన శుక్రవారం శ్రీవారు కల్పవృక్ష వాహనంపై భక్తులకు దివ్యమంగళ రూపంలో దర్శనమిచ్చారు. ఈ దివ్య ఘట్టంలో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తదితరులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాల సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది.