జగిత్యాలలో అంగన్వాడీల కలెక్టరేట్ ముట్టడి: వేతనాలు పెంచాలని డిమాండ్

రిపోర్టర్: హరి స్థలం: జగిత్యాల

తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల కలెక్టరేట్ ముట్టడికి యత్నించినట్లు అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ర్యాలీగా చేరుకుని నిరసన వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. నెలకు పద్దెనిమిది వేల రూపాయల వేతనం చెల్లించాలని, బీఎల్ఓ విధుల నుంచి మినహాయించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. ఇరవై ఐదు లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లు వెల్లడించారు.