ముచింపుల యూత్ కాంగ్రెస్ కమిటీ ఏకగ్రీవం: అధ్యక్షుడిగా అంతులేని శ్రీకాంత్ ఎన్నిక

రిపోర్టర్: T.RAJASHEKAR స్థలం: నర్సంపేట

వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని ముచింపుల గ్రామంలో నూతన యూత్ కాంగ్రెస్ గ్రామ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఆదేశాలతో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పురుషోత్తం సురేష్ ఆధ్వర్యంలో ఈ ఎన్నిక నిర్వహించారు. గ్రామ శాఖ అధ్యక్షుడిగా అంతులేని శ్రీకాంత్, వర్కింగ్ ప్రెసిడెంట్గా తాళ్లపల్లి అనిల్ ఎంపికయ్యారు. పార్టీ బలోపేతానికి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి యువత అంకితభావంతో కృషి చేయాలని మండల నాయకత్వం ఈ సందర్భంగా శ్రేణులకు పిలుపునిచ్చింది.