ప్రభుత్వ ఆసుపత్రుల్లో నవజాత శిశువుల కోసం ఎన్టీఆర్ బేబీ కిట్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: సత్తెనపల్లి

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే తల్లులు, నవజాత శిశువుల కోసం ఎన్టీఆర్ బేబీ కిట్ పథకాన్ని ప్రభుత్వం పునఃప్రారంభించింది. ప్రసవం అనంతరం శిశువుకు అవసరమైన 14 రకాల వస్తువులతో కూడిన కిట్ను ఉచితంగా అందించనున్నారు. ఇందులో బేబీ బెడ్, దోమల తెర, దుస్తులు, పౌడర్, సోప్ వంటి నిత్యావసరాలు ఉన్నాయి. వీటిని తీసుకెళ్లేందుకు ప్రత్యేక బ్యాగ్ను కూడా ప్రభుత్వం అందజేస్తోంది. ఈ పథకం ద్వారా పేద తల్లులకు ఎంతో మేలు చేకూరనుంది.