విభిన్నప్రతిభావంతులకు అండగా ప్రభుత్వం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ త్రిచక్ర వాహనాల పంపిణీ

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: విజయనగరం

విభిన్న ప్రతిభావంతులు సమాజంలో గౌరవంగా జీవించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. విజయనగరం కలెక్టరేట్ ఆవరణలో శుక్రవారం జిల్లాలోని అర్హులైన అరవై ఒక్క మందికి అరవై ఒక్క లక్షల రూపాయల వ్యయంతో ఉచిత త్రిచక్ర వాహనాలను పంపిణీ చేశారు. రాష్ట్ర కార్పొరేషన్ ఛైర్మన్ జి.నారాయణస్వామి, ఎమ్మెల్యే లోకం నాగమాధవి, కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డితో కలిసి ఆయన ఈ వాహనాలను ప్రారంభించారు.