ఇందిరమ్మ ఇల్లు నూతన గృహప్రవేశాన్ని ప్రారంభించిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
రిపోర్టర్: Rajashekar
స్థలం: నర్సంపేట
నర్సంపేట:నర్సంపేట మున్సిపాలిటీ 20వ డివిజన్‌కు చెందిన కొండోజు గీతా - చరణ్ నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమాన్ని నర్సంపేట శాసనసభ్యులు శ్రీ దొంతి మాధవరెడ్డి ప్రారంభించి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని, అర్హులైన ప్రతి కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించడమే ప్రభుత్వ సంకల్పమని అన్నారు. ప్రజల సంక్షేమం, గ్రామాలు మరియు పట్టణాల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులు మరియు పలువురు స్థానికులు పాల్గొన్నారు.