మంత్రి సీతక్కను కలిసిన వైఎస్ షర్మిల: కుమార్తె వివాహ పత్రిక అందజేత
రిపోర్టర్: సునీల్
స్థలం: హైదరాబాద్
తెలంగాణ మంత్రి సీతక్కను ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మర్యాదపూర్వకంగా కలిసి కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారుని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లోని సీతక్క నివాసానికి భర్త అనిల్‌తో కలిసి వెళ్లిన షర్మిల, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా సీతక్క ఆమెను ఆప్యాయంగా ఓదార్చారు. నవంబర్ 25న జరగనున్న వివాహ వేడుకకు రావాల్సిందిగా ప్రముఖులను వ్యక్తిగతంగా ఆహ్వానిస్తున్నారు.