విజయనగరం జిల్లాలో పాఠశాల బస్సుల ఫిట్‌నెస్ ధ్రువపత్రాలపై విమర్శలు

రిపోర్టర్: సునీల్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లాలో 581 పాఠశాల బస్సులకూ రవాణా శాఖ ఫిట్‌నెస్ ధ్రువపత్రాలు జారీ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం ప్రైవేటు పాఠశాల బస్సు బోల్తాపడిన ఘటన కలకలం రేపింది. అధికారుల తనిఖీల్లో లోపాలున్నట్లు తేలిన బస్సులు సైతం స్వల్ప వ్యవధిలోనే ఫిట్‌నెస్‌ సాధించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏజెంట్ల ద్వారా అదనపు వసూళ్లతో ఆన్‌లైన్‌లో ఎఫ్‌సీలు జారీ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.