మ్యాక్ యూజర్ల కోసం మెటా కొత్త మ్యూజ్ ఏఐ ఏజెంట్ విడుదల
రిపోర్టర్: నరేష్
స్థలం: World
ప్రముఖ టెక్ దిగ్గజం మెటా తన మొదటి కన్జూమర్ ఏఐ ఏజెంట్ మ్యూజ్‌ను తాజాగా మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు కూడా విస్తరించింది. ఈ సరికొత్త పర్సనల్ ఏఐ టూల్ డౌన్లోడ్స్ ఫోల్డర్‌ను నిర్వహించడం, కోల్పోయిన ఫైళ్లను వెతకడం, సందేశాలు మరియు నోట్లను సమ్మరైజ్ చేయడం వంటి క్లిష్టమైన రోజువారీ పనులను యూజర్ల తరఫున సమర్థవంతంగా పూర్తి చేయగలదని కంపెనీ వెల్లడించింది.