కళ్లారా చూసుకోకముందే అనంత లోకాలకు..

రిపోర్టర్: ISHAM JOURNALISM స్థలం: ఆదిలాబాద్ అర్బన్

TG: ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి వార్డులో ఏసీ పేలడంతో అప్పుడే లోకాన్ని చూసిన ముగ్గురు పసికందులు ఊపిరి వదిలారు. తొమ్మిది నెలల ఆశలు, పడిన కష్టాలు ఒక్క క్షణంలో బూడిదవడంతో ఆ తల్లుల కడుపుకోత వర్ణనాతీతం. లాలించి జోలపాడాల్సిన చేతులతో ప్రాణం లేని పసిపాపలను మోయాల్సి రావడం ఆ కన్నవారి గుండెలను పిండేస్తోంది. కళ్లారా చూసుకోకముందే బిడ్డలు చనిపోవడంతో ఆ తల్లిదండ్రుల రోదనలతో ఆస్పత్రి ప్రాంగణమంతా కన్నీటిసంద్రమైంది