కడపలో తీవ్ర కలకలం: వైసీపీ ప్రచార ర్యాలీలో కత్తితో టీడీపీ కార్యకర్త వీరంగం

రిపోర్టర్: రమేష్ స్థలం: Kadapa

కడప నగరంలోని నలభై మొదటి డివిజన్లో వైకాపా ఎన్నికల ప్రచార ర్యాలీలో కత్తితో తెలుగుదేశం పార్టీ కార్యకర్త సయ్యద్ భాషా హల్చల్ చేశాడని తెలుగుఫీడ్ సైట్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఆరే శ్యామల, మేయర్ అభ్యర్థి బండి దీప్తి నిర్వహిస్తున్న ప్రచారంలోకి మాజీ కార్పొరేటర్ అయిన టీడీపీ కార్యకర్త కత్తులతో దూసుకొచ్చి వీరంగం సృష్టించారని, దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత తలెత్తడంతో పాటు స్థానికంగా కలకలం రేగిందని సదరు పోస్టులో పేర్కొన్నారు.