కడప జిల్లాలో యథేచ్ఛగా అక్రమ ఇసుక తవ్వకాలు
రిపోర్టర్: నరేష్
స్థలం: కడప
కడప జిల్లాలో పెన్నా నదితో పాటు పలు నదుల్లో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ నిషేధాజ్ఞలను బేఖాతరు చేస్తూ రాత్రింబవళ్లు భారీ యంత్రాలతో ఇసుకను అక్రమంగా తవ్వి పొరుగు జిల్లాలు, రాష్ట్రాలకు తరలిస్తున్నారు. రోజూ కోట్లాది రూపాయల సంపద దోపిడీకి గురవుతుండటంతో భూగర్భ జలాలు అడుగంటి, తాగు, సాగునీటి కష్టాలు మునుముందుకు వస్తున్నాయి. దీనిపై అధికారులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.