హైదరాబాద్ లో కోకాపేట భూముల వేలానికి రియల్టర్ల ముఖం చాటుడు

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌లోని కోకాపేట్ నియోపోలిస్ లేఅవుట్‌లో హెచ్‌ఎండీఏ నిర్వహించిన 4.59 ఎకరాల భూముల వేలానికి రియల్టర్ల నుంచి ఆశించిన స్పందన లభించలేదు. కేవలం సింగిల బిడ్ మాత్రమే దాఖలు కావడంతో అధికారులు ఆ వేలాన్ని రద్దు చేశారు. నగరంలో రియల్ ఎస్టేట్ రంగం మందగించడం, హైడ్రా కూల్చివేతలు, ప్రభుత్వ విధానాల కారణంగా పెట్టుబడిదారులు వెనకడుగు వేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తుండగా, హెచ్‌ఎండీఏ మాత్రం రెండో దశ వేలానికి కసరత్తు చేస్తోంది.