నీళ్లు లేక తేలుతున్న మిర్యాలగూడ వినాయక విగ్రహాలు
రిపోర్టర్: నరేష్
స్థలం: Miryalaguda, Nalgonda
తెలంగాణ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో తీవ్ర నీటి ఎద్దడి కారణంగా వినాయక నిమజ్జనానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాలువల్లో నీరు సరిగ్గా లేకపోవడంతో నిమజ్జనం చేసిన విగ్రహాలు మునగకుండా నీటిపైనే తేలుతున్నాయి. వేసిన చోటే విగ్రహాలు తేలుతుండటంతో భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు మండిపడుతున్నారు.