ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాలను సందర్శించిన పంజాబ్ జర్నలిస్టుల బృందం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: ఆంధ్రప్రదేశ్

కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును పరిశీలించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని పంజాబ్ జర్నలిస్టుల బృందం సోమవారం సందర్శించింది. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ టి. శ్రీనివాసన్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జితేంద్ర మోహన్ మిశ్రా, ఫైనాన్స్ అధికారి ప్రొఫెసర్ ఎం. శరత్‌చంద్రబాబులతో పాటు పలువురు అధ్యాపకులతో జర్నలిస్టులు సమావేశమై ముఖాముఖి నిర్వహించారు. విశ్వవిద్యాలయ పనితీరు, గిరిజన విద్యార్థులకు అందిస్తున్న ఉన్నత విద్యావకాశాలు, పరిశోధనా పురోగతిని అధ్యాపక బృందం జర్నలిస్టులకు వివరించింది.