నెట్ఫ్లిక్స్ లో కీర్తి సురేశ్ అక్క వెబ్ సిరీస్ స్ట్రీమింగ్

రిపోర్టర్: వెంకట్ స్థలం: హైదరాబాద్

జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేశ్ మరియు ప్రతిభావంతురాలైన రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్ లో నటించిన అక్క వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ లో అక్టోబర్ 30వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతున్నట్లు మేకర్స్ తెలిపారు. మాతృస్వామ్య వ్యవస్థ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో భవాని పాత్రలో కీర్తి సురేశ్ నటన అద్భుతంగా ఉందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.