కొయ్యూరు మండలంలో నకిలీ టీచర్ల పేరుతో సైబర్ మోసం

రిపోర్టర్: SINDERI KAMESH స్థలం: కొయ్యూరు

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలోని: గొర్రెలమెట్ట, అన్నవరం గ్రామాలకు చెందిన యువకులకు సైబర్ మోసగాళ్లు ఫోన్ చేసి, పెదవలస పాఠశాల టీచర్లమంటూ రూ.5 వేలు ఫీజు చెల్లించాలని కోరారు. డబ్బులు పంపితే రూ.27 వేలు ఫోన్పే చేస్తామని నమ్మించి నగదు బదిలీ చేయించుకుని మోసం చేశారు. బాధితులు మంప పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అపరిచితులకు డబ్బులు పంపవద్దని పోలీసులు హెచ్చరించారు.