వరంగల్ జిల్లాలో మహిళా నైపుణ్య శిక్షణపై కలెక్టర్ సమీక్ష
రిపోర్టర్: హరి
స్థలం: వరంగల్
వరంగల్ జిల్లా కలెక్టరేట్లో వీ-హబ్ ప్రతినిధులతో మహిళల నైపుణ్యాభివృద్ధి మరియు పత్తి కొనుగోళ్ల ముందస్తు కార్యాచరణపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజుతో కలిసి పాల్గొన్నట్లు కలెక్టర్ వరంగల్ అధికారిక ఖాతా ద్వారా వెల్లడించారు. ఖానాపూర్ మండలం బుధరావుపేటలోని తెలంగాణ మోడల్ స్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థినులతో మాట్లాడినట్లు తెలిపారు. విద్యా ప్రమాణాలు మరియు ప్రభుత్వ మెనూ ప్రకారం భోజనం అందుతున్న తీరును అధికారులతో సమీక్షించారు.