భక్తిపారవశ్యంతో పులకించిన తుమ్మలగుంట
రిపోర్టర్: రామానుజపల్లి హరిబాబు
స్థలం: తిరుపతి రూరల్
తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలో శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఐదవ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా మోహినీ అవతారంలో పల్లకీపై భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు. గోవింద నామస్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవం కన్నులపండువగా సాగింది. వివిధ గ్రామాల నుంచి భక్తులు సారె సమర్పించి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు.