మహిళల సంక్షేమమే లక్ష్యంగా మోదీ సర్కార్ ముద్ర
రిపోర్టర్: హరి
స్థలం: New Delhi
ఆడబిడ్డ పుట్టిన నాటి నుంచి విద్య, ఆరోగ్యం, భద్రత, స్వావలంబన వరకు ప్రతి దశలోనూ మహిళలకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. నారీశక్తి గౌరవం, సాధికారతే ధ్యేయంగా మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అంగన్ కా ఉత్సవ్, సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాల ద్వారా మహిళల అభ్యున్నతికి కేంద్రం నిరంతరం కృషి చేస్తోంది.