ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం: సిద్దిపేటకు దర్యాప్తు బదిలీ
రిపోర్టర్: మహేష్
స్థలం: సిద్దిపేట
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు వేగవంతమైందని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైన ఈ కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుందని, ఈ దర్యాప్తును సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. గతంలో నమోదైన ఎఫ్ఐఆర్ కు అదనంగా మరికొన్ని సెక్షన్లను చేర్చి కొత్త క్రైమ్ నంబర్ తో పోలీసులు రీరిజిస్టర్ చేయడం ప్రస్తుతం రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.