వరంగల్లో నాణ్యతలేని ప్రముఖ ఆహార సంస్థల లైసెన్సులను రద్దుచేసిన అధికారులు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: వరంగల్
వరంగల్ మరియు హనుమకొండ జిల్లాల్లో ఆహార భద్రతా అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నాణ్యతా లోపాలు ఉన్న పలు ప్రముఖ సంస్థల లైసెన్సులు సస్పెండ్ చేశారు. దయానంద్ ఐస్క్రీమ్స్, రాజు ఘీ స్వీట్స్ సహా పలు యూనిట్లపై చర్యలు తీసుకున్నారు. మరో నాలుగు సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు ఒక సంస్థపై ఉన్నతాధికారులకు సస్పెన్షన్ సిఫార్సు చేశారు.