మంచిర్యాల అభివృద్ధికి ఎంపీ వంశీకృష్ణ ప్రత్యేక చొరవ చూపారన్న నేతలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: మంచిర్యాల

మంచిర్యాల జిల్లాలో పెండింగ్లో ఉన్న రోడ్డు పనులు, హై లెవల్ బ్రిడ్జిల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీ వంశీకృష్ణ కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. చెన్నూరు, చిర్రకుంట, రసూల్పల్లి, ఆదిల్పేట్, వెంకటాపూర్, ముదిగుంట ప్రాంతాల్లో సుమారు 16 కి.మీ మేర రూ.40 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టాల్సిన రోడ్డు వైడెనింగ్, స్ట్రెంగ్థెనింగ్ పనులను తక్షణమే పూర్తి చేయాలని ఆయన కోరడం విశేషం.