మహా విషాదం: క్యాన్సర్‌పై పోరాడిన ప్రముఖ వైద్యురాలే అదే వ్యాధితో మృతి
రిపోర్టర్: రాము
స్థలం: Arizona
క్యాన్సర్‌ను అంతం చేసేందుకు జీవితాన్ని అంకితం చేసిన ప్రముఖ అమెరికా పరిశోధకురాలు, వైద్యురాలు డాక్టర్ రచన ష్రాఫ్ తన 47 ఏళ్ల వయసులో అదే ప్రాణాంతక వ్యాధితో మృతి చెందినట్లు అమెరికన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ మంగళవారం వెల్లడించింది. అరిజోనా విశ్వవిద్యాలయంలో పాంక్రియాటిక్, బైల్ డక్ట్ క్యాన్సర్లపై పరిశోధనలు చేసిన ఆమె, తన చివరి క్షణాల వరకు రోగులకు భరోసానిస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారని నిపుణులు గుర్తుచేశారు.