రాష్ట్రంలో ట్రాఫిక్ నిర్వహణకు ప్రత్యేక బ్యూరో ఏర్పాటు చేసిన ప్రభుత్వం
రిపోర్టర్: హరి
స్థలం: హైదరాబాద్
తెలంగాణలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు రోడ్డు భద్రతను పటిష్టం చేసేందుకు ప్రత్యేకంగా టీజీ-టీమార్స్ బ్యూరోను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఈ వ్యవస్థ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ నిర్వహణ, హైవే పెట్రోలింగ్, ప్రమాదాల స్పందన వంటి అంశాలను సమన్వయం చేయనున్నారు. జరిమానాల వసూళ్లలో నలభై శాతం నిధులతో ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఫండ్‌ను ఏర్పాటు చేసి ఆధునిక సాంకేతిక పరికరాలను కొనుగోలు చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.