అన్నదాతల ఆక్రోశం: ఖమ్మంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పత్తి పంట

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: ఖమ్మం

ఖమ్మం జిల్లాలో అకాల వర్షాల కారణంగా పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఎకరానికి కేవలం నాలుగు క్వింటాళ్ల లోపే దిగుబడి వస్తోందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. తుపాన్ల ప్రభావంతో పంట తడిసిపోవడంతో పాటు మార్కెట్ లో తేమ పేరుతో వ్యాపారులు ధరలు తగ్గిస్తున్నారని వాపోయారు. పెట్టిన పెట్టుబడులు కూడా రాకపోవడంతో కష్టమంతా బూడిదలో పన్నీరైందని ఆవేదన చెందుతున్న తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వారు కోరారు.