నేలకొండపల్లిలో ఘనంగా గణనాథుడికి 108 రకాల ప్రసాదాల నైవేద్యం

రిపోర్టర్: kasanivenkatesh స్థలం: నేలకొండపల్లి

ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని ఆర్యవైశ్యుల గణేష్ మండపం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. పట్టణ ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో గణనాథుడికి 108 రకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. విఘ్నేశ్వరునికి ప్రత్యేక అర్చనలు చేశారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆర్యవైశ్యులు, మహిళలు, భక్తులు విశేష సంఖ్యలో హాజరయ్యారు.