ఆంధ్రా పేపర్ మిల్స్ తీరుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం

రిపోర్టర్: విజయ్ స్థలం: రాజమహేంద్రవరం

గోదావరి నది కాలుష్యానికి ఆంధ్రా పేపర్ మిల్స్ సగం కారణమని, పన్నులు ఎగ్గొడుతూ కోర్టులతో కాలయాపన చేస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పర్యావరణాన్ని దెబ్బతీస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న యాజమాన్యంపై ఇక ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలు పాటించని పరిశ్రమల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ఆయన స్పష్టం చేశారు.