ఫిఫా సంచలన నిర్ణయం.. ఇద్దరు మాజీ అధ్యక్షులపై జీవితకాల నిషేధం
రిపోర్టర్: సునీల్
స్థలం: World
నిధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై ఫిఫా కఠిన చర్యలు తీసుకుంది. మాన్‌సెరాట్ ఫుట్‌బాల్ చీఫ్ విన్సెంట్ కాసెల్, మాల్దీవుల ఫుట్‌బాల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు బస్సామ్ అదీల్ జలీల్‌లపై జీవితకాల నిషేధం విధించింది. పదవుల దుర్వినియోగం, కొవిడ్ సహాయ నిధుల స్వాహాకు పాల్పడినట్లు తేలడంతో ఫిఫా ఎథిక్స్ కమిటీ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.