కాణిపాకం వినాయక స్వామిని దర్శించుకున్న దేవాదాయ శాఖ కమిషనర్
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: ఐరాల
చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దేవాదాయ శాఖ కమిషనర్ రామ్ చంద్రమోహన్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈవో పెంచల కిషోర్, చైర్మన్ మణి నాయుడు స్వాగతం పలికారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.