అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు: డొనాల్డ్ ట్రంప్ సర్కార్ కు భారీ షాక్
రిపోర్టర్: రాజేష్
స్థలం: California
అమెరికాలో కాలిఫోర్నియా ఎన్నికల వివాదంపై యుఎస్ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించినట్లు అధికారులు తెలిపారు. ఓటర్ల పౌరసత్వంపై వివాదం కారణంగా సుమారు ఇరవై వేల బ్యాలెట్లను పక్కన పెట్టాలని ట్రంప్ యంత్రాంగం చేసిన అత్యవసర అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. ఈ నిర్ణయంతో ట్రంప్ ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలిందని, ప్రజాస్వామ్యం గెలిచిందని కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ నికోసమ్ హర్షం వ్యక్తం చేశారు.