నగరి గంగమ్మకు భక్తిపూర్వకంగా పట్టు వస్త్రాల సమర్పణ
రిపోర్టర్: katikapalli perumal
స్థలం: నగరి
చిత్తూరు జిల్లా నగరిలో ఘనంగా జరుగుతున్న గంగమ్మ జాతరలో ఎమ్మెల్యే భాను ప్రకాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలను ఆయన భక్తిపూర్వకంగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రజలు పాల్గొన్నారు. జాతర సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఈ వేడుక నగరిలో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.